ఘనంగా దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల ముగింపు
అమ్మవారి చీరలు, కలశాలు, డబ్బుల దండ వేలంపాటకు భక్తుల విశేష స్పందన రూ.32 వేలకు అమ్మవారి డబ్బుల దండను దక్కించుకున్న హనుమాన్ యూత్ సభ్యులు వేములపల్లి, ప్రజాశక్తి అక్టోబర్ 22 : నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని లక్ష్మీదేవిగూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమ్మవారికి అలంకరించిన చీరలు, కలశాలు, డబ్బుల దండ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేలంపాటకు గ్రామ ప్రజలు, భక్తుల నుంచి విశేష స్పందన...