manaprajashakti.in
Date of Publish : 30 October 2026, 11:32 am Posted by : MANA PRAJASHAKTI

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోసే కార్యక్రమం 

పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోసే కార్యక్రమం 

సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం

నేరేడుచర్ల,అక్టోబర్ 30 మన ప్రజాశక్తి :

మండల పరిధిలోని కందులవారిగూడెం గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామానికి చెందిన పది మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి కొబ్బరికాయ కొట్టి, ముగ్గు పోసి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్‌రెడ్డి, ఉపసర్పంచ్ నాగరాజు, హౌసింగ్ ఏఈ వంశీ, పంచాయతీ కార్యదర్శి శోభన్ తదితరులు పాల్గొన్నారు.