manaprajashakti.in
Date of Publish : 03 November 2026, 12:10 pm Posted by : MANA PRAJASHAKTI

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట ఏవో

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట ఏవో

 

సంగారెడ్డి, ప్రజాశక్తి నవంబర్ 3 :

ఎరువుల వ్యాపారం నిరాటంకంగా సాగేందుకు రూ. 20,000 లంచం తీసుకుంటూ సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారుడి అల్లుడు నిర్వహిస్తున్న ఫెర్టిలైజర్ షాపును ఇబ్బంది పెట్టకుండా చూసేందుకు ఏవో రమేష్ మొత్తం రూ. 30,000 డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19న ముందస్తుగా రూ. 10,000 స్వీకరించారు. మిగతా రూ. 20,000 లంచం సొమ్మును తన కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి, నగదును స్వాధీనం చేసుకున్నారు.ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లంచం డిమాండ్ చేసిన ఏవో రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని హైదరాబాద్‌లోని రెండవ అదనపు ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.