లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట ఏవో
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట ఏవో సంగారెడ్డి, ప్రజాశక్తి నవంబర్ 3 : ఎరువుల వ్యాపారం నిరాటంకంగా సాగేందుకు రూ. 20,000 లంచం తీసుకుంటూ సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి అల్లుడు నిర్వహిస్తున్న ఫెర్టిలైజర్ షాపును ఇబ్బంది పెట్టకుండా చూసేందుకు ఏవో రమేష్ మొత్తం రూ. 30,000 డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19న ముందస్తుగా రూ. 10,000 స్వీకరించారు. మిగతా రూ. 20,000 లంచం సొమ్మును...