డ్యూటీకి వెళుతున్న ఎస్సై బైకు అదుపుతప్పి క్రిందపడటంతో తీవ్ర గాయాలైన ఘటన
నేరేడుచర్ల:- అక్టోబర్ 14 మన ప్రజాశక్తి
ఎస్సై సతీష్ నివాస స్థలమైన కందుల వారి గూడెం నుండి రోజులాగే డ్యూటీకి వెళుతున్న ఎస్సై బైకు అదుపుతప్పి కింద పడటంతో తీవ్ర గాయాల పాలైన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామగిరి శివారులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది నేరేడుచర్ల మండలంలోని కందుల వారి గూడెం కు చెందిన అత్తి సతీష్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్నారు . ఆయన ఇంటికి వచ్చి తిరిగి డ్యూటీ కి వెళ్తున్న క్రమంలో రామగిరి వద్ద అతను ప్రయాణిస్తున్న బైకు అదుపుతప్పి కింద పడటంతో ప్రమాదం జరిగింది .ఈ ప్రమాదంలో ఆయనకు బలమైన గాయాలు కావడంతో మిర్యాలగూడ హాస్పిటల్ కి తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు.
