28.2 C
Hyderabad
Wednesday, November 25, 2026

శోభాయాత్రలో రచ్చ.. 11 మందిపై అట్రాసిటీ కేసు  కార్పొరేటర్ సహా పలువురిపై కేసు నమోదు.. జయమ్మ కాలనీలో ఉద్రిక్తత బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు 

📰 Generate e-Paper Clip

పాల్వంచ,మన ప్రజాశక్తి
గణేష్ శోభాయాత్ర.సందడి మధ్య ఒక్కసారిగా వివాదం చోటుచేసుకుంది.మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసిన ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వంచ పట్టణం జయమ్మ కాలనీలో గణేష్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన ఘటనపై 7వ డివిజన్ కరోరేటర్ సింధు తపస్వితో పాటు మరో 10 మందిపై అట్రాసిటీ కేసు నమోదైంది.శోభాయాత్రలో ట్రాక్టర్ డ్రైవర్ గుగులోతు రమేష్, ఆయన వెంట వచ్చిన కొందరితో వివాదం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారని బాధితుల ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కార్పొరేటర్ సింధు తపస్వి, అఖిల్, విద్యాసాగర్, ఎం.డీ. అజ్మద్ పాషా, వెంకన్న తదితర 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.ఘర్షణకు సంబంధించిన ఘటనపై కేసు నమోదు కావడంతో జయమ్మ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్గం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరే పరిస్థితి నెలకొంది.ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఘర్షణలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles