25.2 C
Hyderabad
Wednesday, November 25, 2026

ఘనంగా దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల ముగింపు

📰 Generate e-Paper Clip

అమ్మవారి చీరలు, కలశాలు, డబ్బుల దండ వేలంపాటకు భక్తుల విశేష స్పందన

రూ.32 వేలకు అమ్మవారి డబ్బుల దండను దక్కించుకున్న హనుమాన్ యూత్ సభ్యులు

వేములపల్లి, ప్రజాశక్తి అక్టోబర్ 22 :

నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని లక్ష్మీదేవిగూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమ్మవారికి అలంకరించిన చీరలు, కలశాలు, డబ్బుల దండ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేలంపాటకు గ్రామ ప్రజలు, భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. భక్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో అమ్మవారి మండపం సందడిగా మారింది.నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చివరి రోజు నిర్వహించిన వేలంపాటలో భక్తులు పోటాపోటీగా పాల్గొని అమ్మవారికి అలంకరించిన చీరలు, కలశాలు, డబ్బుల దండలను దక్కించుకున్నారు. వేలంపాటలో పాల్గొన్న భక్తులు అమ్మవారిపై తమకున్న భక్తి, విశ్వాసాలను చాటుకున్నారు
రూ.32 వేలకు డబ్బుల దండ వేలం ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అమ్మవారి డబ్బుల దండ వేలంపాటలో హనుమాన్ యూత్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని రూ.32 వేల ధరకు దక్కించుకున్నారు. ఈ వేలంపాట భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది.వేలంపాటలో పాల్గొన్న వారికి సన్మానం అమ్మవారి చీరలు, కలశాల వేలంపాటలో పాల్గొని వాటిని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సబ్బు సతీష్ రెడ్డి, కుంభం రమేష్, సతీష్ చారి, జంగిలి శ్రీను, కుంభం నాగరాజు, మల్లెబోయిన కిషోర్, గంటా గౌతం, సబ్బు లింగారెడ్డి, ముత్యాల నరేందర్, పెరపాక గోపి, సింగం ప్రియాంక, కంకణాల జాన్ రెడ్డితో పాటు డబ్బుల దండను దక్కించుకున్న హనుమాన్ యూత్ సభ్యులను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.గ్రామ ప్రజలు, భక్తుల సహకారంతో నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు, భక్తులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles